Tollywood: గుండెపోటుతో కన్నుమూసిన నటుడు జయప్రకాశ్ రెడ్డి

Actor Jayaprakash Reddy passes away
  • ఈ ఉదయం స్నానాల గదిలో కుప్పకూలి మరణించిన జయప్రకాశ్
  • బ్రహ్మపుత్రుడు సినిమాతో టాలీవుడ్‌లోకి
  • శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, రాయలసీమ యాసతో విలన్ పాత్రల్లో  ఒదిగిపోయే జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. లాక్‌డౌన్ నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన ఈ ఉదయం స్నానాల గదిలో కుప్పకూలి  మరణించారు. జయప్రకాశ్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సిరివెళ్ల. 8 మే 1946లో జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి వెంకటేశ్ నటించిన బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. జయప్రకాశ్ రెడ్డి మృతి విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
Tollywood
Actor Jayaprakash reddy
Heart attack
Passes away

More Telugu News