Krishnapatnam Port: అదానీ గ్రూప్ చేతికి కృష్ణపట్నం పోర్టు... ఉత్తర్వులు జారీ

  • కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటా అదానీ గ్రూప్ పరం
  • రూ.13,572 కోట్లు చెల్లించిన అదానీ గ్రూప్
  • నాట్కో జినోమిక్ సంస్థకు 25 శాతం వాటా కొనసాగింపు
Krishnapatnam port now goes to Adani Group

రాష్ట్రంలోని అతిపెద్ద ప్రైవేటు పోర్టు అయిన కృష్ణపట్నం పోర్టు అదానీ గ్రూప్ పరమైంది. నవయుగ సంస్థకు చెందిన 75 శాతం వాటాలను అదానీ గ్రూప్ కు బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాట్కో జినోమిక్ ప్రైవేటు లిమిటెడ్ కు 25 శాతం వాటా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను అదానీ గ్రూపు రూ.13,572 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ మొత్తంలోనే కృష్ణపట్నం పోర్టుకు చెందిన రూ.6 వేల కోట్ల అప్పు కూడా ఉంది. ఈ రుణాన్ని అదానీ గ్రూప్ చెల్లించనుంది. మిగతా మొత్తాన్ని కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ (కేపీసీఎల్) సంస్థకు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది.

More Telugu News