Vallabhaneni Vamsi: చంద్రబాబు తన కొడుకు లోకేశ్ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు: వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi slams TDP Supremo Chandrababu Naidu
  • ఉచిత విద్యుత్ ను హేళన చేశారంటూ బాబుపై ఆగ్రహం
  • బాబుకు పిచ్చెక్కిందనుకుంటున్నారని వ్యాఖ్య 
  • 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఏమైందన్న వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఉచిత విద్యుత్ సాధ్యం కాదని, విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు తన పాలనలో విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించలేదని, ఉచిత విద్యుత్ పై చులకనగా మాట్లాడారని తెలిపారు. ఇప్పుడు రైతులకు నగదు బదిలీ పథకంతో ఉచిత విద్యుత్ కు ఉరివేసినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

42 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు తన కొడుకు లోకేశ్ లా స్థాయి దిగి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉండి కూడా ఇలా చిల్లరగా మాట్లాడుతుంటే పిచ్చి పట్టిందేమో అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతులు మరో 30 ఏళ్ల పాటు ఇబ్బందులు పడకూడదనే కేంద్ర సంస్కరణలను సీఎం జగన్ అందిపుచ్చుకున్నారని, జీతాలు, పెన్షన్ల మాదిరే ఉచిత విద్యుత్ డబ్బులు కూడా ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.
Vallabhaneni Vamsi
Chandrababu
Jagan
Free Current
Telugudesam
Andhra Pradesh

More Telugu News