Shiv Sena: దావూద్ ఇబ్రహీంకు కూడా రక్షణ కల్పిస్తారు: కేంద్రంపై శివసేన ఫైర్

Sena MLAs Dawoo Jibe At Centre Over Kangana Ranauts Y Security
  • కంగనకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించిన కేంద్రం
  • కేంద్ర నిర్ణయంపై శివసేన మండిపాటు
  • ముంబైని పీఓకేతో పోల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ సెక్యూరిటీని కల్పించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కూడా రక్షణ కల్పిస్తారని ఎద్దేవా చేశారు. దావూద్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం మాట్లాడితే... రేపే దావుద్ కు కూడా కేంద్రం రక్షణ కల్పిస్తుందని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి వారు ఏమైనా చేస్తారని మండిపడ్డారు.

ఉత్తరప్రదేశ్, బీహార్ లలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మహిళా కమిషన్ కు కనిపించవని ప్రతాప్ విమర్శించారు. ముంబై పోలీసులను నమ్మని వ్యక్తులకు కేంద్రం భద్రత కల్పించిందని అన్నారు. మంబైని పీఓకేతో పోల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కంగనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Shiv Sena
Kangana Ranaut
Bollywood
Dawood Ibrahim

More Telugu News