Roja: అంబులెన్స్ బైక్ పై రోజా... ఫొటోలు ఇవిగో!

YCP MLA Roja inaugurates bike ambulances in Nagari constituency
  • పుత్తూరు ఆసుపత్రికి బైక్ అంబులెన్స్ లు
  • శ్రీసిటీ హీరో మోటార్స్ సంస్థ దాతృత్వం
  • జెండా ఊపి ప్రారంభించిన రోజా
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ స్వయంగా అంబులెన్స్ బైక్ నడిపారు. తన నగరి నియోజకవర్గంలోని శ్రీసిటీ హీరో మోటార్స్ సంస్థ రెండు అంబులెన్స్ బైక్ లను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయగా, వాటిని రోజా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా అంబులెన్స్ బైక్ ను పరీక్షించారు. ఓ బైక్ పై కొన్ని రౌండ్లు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ బైక్ అంబులెన్స్ లను సత్వరమే రోగుల వద్దకు చేరుకునేందుకు ఉద్దేశించి రూపొందించారు. వీటి ద్వారా ఓ రోగిని సులువుగా ఆసుపత్రికి తరలించవచ్చు.
Roja
Bike Ambulance
Nagari
Puthuru
Govt Hospital

More Telugu News