Unlock-4: అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

  • లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అన్ లాక్ 4.0
  • ఈ నెల 21 నుండి 9, 10వ తరగతి, ఇంటర్ తరగతులు
  • తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి తప్పనిసరి
  • 100 మంది మించని సమావేశాలకు అనుమతి
AP Government issues unlock four

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఏపీ సర్కారు అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 21 నుండి 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 21 నుంచి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లకు కూడా అనుమతి ఇచ్చింది. పీహెచ్ డీ, పీజీ విద్యార్థులు కూడా తరగతులకు హాజరయ్యేందుకు అభ్యంతరాలను తొలగించింది. ఈ నెల 21 నుంచి 100 మంది మించకుండా సమావేశాలు జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 20 నుంచి వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మించకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఏపీ సర్కారు ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News