passes away: నాటి 'ల‌వ‌కుశ' నాగ‌రాజు క‌న్నుమూత

  • 1963లో విడుదలైన 'ల‌వ‌కుశ'‌
  • ల‌వుడి పాత్ర‌లో న‌టించిన‌ నాగ‌రాజు
  • ‌శ్వాస‌కోశ వ్యాధితో తుదిశ్వాస
nagaraju passes away

సీనియ‌ర్ ఎన్టీ రామారావు, అంజలీదేవి, కాంతారావు, చిత్తూరు నాగయ్య కీల‌క‌పాత్ర‌ల్లో నటించగా, 1963లో విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా 'లవకుశ'లో ల‌వుడి ‌గా న‌టించిన‌ నాగరాజు క‌న్నుమూశారు. హైద‌రాబాద్‌లోని గాంధీన‌గ‌ర్‌లో ఉన్న త‌న నివాసంలో ఆయ‌న శ్వాస‌కోశ వ్యాధితో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతి ప‌ట్ల‌ తెలుగు సినీ చిత్ర ప‌రిశ్ర‌మ సంతాపం తెలుపుతోంది.

కాగా, 1934లో బ్లాక్ అండ్ వైట్ లో వ‌చ్చిన‌ 'లవకుశ'కు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్య తిరిగి అదే కథను మరో లవకుశగా ఎన్టీఆర్ తో కలర్ లో రూపొందించారు. తరాలు మారినా ఈ సినిమాకు ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల్లో ఆద‌ర‌ణ అలాగే వుంది. రామాయ‌ణ గాథ‌ను తెలుపుతూ ఈ సినిమాలో ల‌వ‌కుశ‌లు పాడే పాట ప్ర‌తి ఇంట్లోనూ విన‌ప‌డుతూనే ఉంటుంది. నాగ‌రాజు 'భక్తరామదాసు' సినిమాలోనూ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆయ‌న‌ అసలు పేరు నాగేందర్‌రావు. ఆయన త‌న కెరీర్ లో సుమారు 300 చిత్రాల్లో నటించారు.

More Telugu News