Telangana: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్, రామలింగారెడ్డికి స‌భ నివాళులు
  • రాజ‌కీయ స‌ముద్రాన్ని ఈదిన నేత ప్ర‌ణ‌బ్ అన్న కేసీఆర్
  • దేశం శిఖ‌ర స‌మాన‌మైన నేత‌ను కోల్పోయింద‌ని ఆవేద‌న‌
telangana assembly session begins

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉభయ సభల ప్రాంగణాల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచి, థర్మల్ స్కానర్లు సహా అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచారు.

అసెంబ్లీ ప్రాంగణాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులు, పోలీసులకు కూడా కరోనా ప‌రీక్ష‌లు చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారినే లోప‌లికి అనుమ‌తించారు.

సభలో ఒక బెంచ్ లో ఒకరే కూర్చొనేలా ఏర్పాటు చేశారు.  ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి స‌భ నివాళుల‌ర్పించింది. వారి సేవ‌ల‌ను శాస‌న‌ స‌భ్యులు గుర్తు చేసుకుంటున్నారు.

ప్ర‌పంచంలోనే ప్ర‌ముఖ ఆర్థికవేత్త‌గా ప్ర‌ణ‌బ్ పేరు తెచ్చుకున్నార‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల శాస‌నస‌భ సంతాపం తెలియ‌జేస్తోంద‌ని చెప్పారు. ప్ర‌ణ‌బ్ మృతితో ఈ దేశం శిఖ‌ర స‌మాన‌మైన నేత‌ను కోల్పోయింద‌ని తెలిపారు. ప‌శ్చిమ బెంగాల్ లో చిన్న గ్రామంలో పుట్టిన ఆయ‌న రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు ఎదిగార‌ని కొనియాడారు. రాజ‌కీయ స‌ముద్రాన్ని స‌మ‌ర్థంగా ఈదిన నేత ప్ర‌ణ‌బ్ అని ఆయ‌న చెప్పారు.

More Telugu News