Arun kapoor: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, నటి మలైకా అరోరాకు కరోనా

After Arjun Kapoor and Malaika Arora tests positive for Covid
  • కరోనా సోకిన విషయాన్ని బాధ్యతగా వెల్లడిస్తున్నట్టు చెప్పిన అర్జున్ కపూర్
  • వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొందామని పిలుపు
  • త్వరలో ఒక్కటి కాబోతున్న మలైకా, అర్జున్ కపూర్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, అతడి గాళ్‌ఫ్రెండ్ అయిన నటి మలైకా ఆరోరాలు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని వారు స్వయంగా వెల్లడించారు. తనలో ఎటువంటి లక్షణాలు లేవని, బాగానే ఉన్నానని పేర్కొన్న అర్జున్ కపూర్.. తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేయడం బాధ్యతగా భావించి వెల్లడించినట్టు ట్వీట్ చేశాడు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నాడు.

తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తుంటానని చెప్పాడు. వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొని, క్షేమంగా బయటపడతామని నమ్ముతున్నట్టు పేర్కొన్నాడు. మరోవైపు, అర్జున్ కపూర్ ప్రియురాలు మలైకా అరోరాకు కూడా కరోనా సోకినట్టు ఆమె సోదరి అమృతా అరోరా తెలియజేసింది. కాగా, అర్జున్ కపూర్, మలైకాలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Arun kapoor
Malaika Arora
Corona Virus
Bollywood

More Telugu News