Rhea Chakraborty: సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు రియా అంగీకారం!

Rhea admits that she had bought drugs for Sushant
  • రియాను 6 గంటల పాటు విచారించిన ఎన్సీబీ
  • తన సోదరుడి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు వెల్లడి
  • రేపు మరోసారి రియాను ప్రశ్నించనున్న ఎన్సీబీ
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ మృతి వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. నటి రియా చక్రవర్తిని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నేడు ఆసక్తికర సమాచారం రాబట్టింది. సుశాంత్ కోసం తాను డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు నటి రియా అంగీకరించింది. తన సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆమె అధికారులకు తెలిపింది. ఇవాళ్టి విచారణలో రియాను దాదాపు 6 గంటల పాటు విచారించారు. ఎన్సీబీ అధికారులు రియాను రేపు మరోసారి ప్రశ్నించనున్నారు.
Rhea Chakraborty
Drugs
Sushant Singh Rajput
NCB
Mumbai
Bollywood

More Telugu News