Sanjay Raut: దేవుడ్ని ఏ కోర్టులో విచారిస్తారో చెప్పండి!: కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ సంజయ్ రౌత్

Shivsena MP Sanjay Raut slams Nirmala Sitharaman act of god comments
  • దేశ ఆర్థిక మందగమనం దైవఘటనగా పేర్కొన్న నిర్మల
  • కేంద్రం వైఫల్యాన్ని దాచి దేవుడిపై నిందలేంటన్న రౌత్
  • నిర్మల వ్యాఖ్యలు హిందుత్వకు అవమానమంటూ ఆగ్రహం
ఇటీవల దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితికి దైవఘటన (యాక్ట్ ఆఫ్ గాడ్) కారణమంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు అనేక విమర్శలకు దారితీస్తున్నాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా నిర్మల వ్యాఖ్యలను తప్పుబట్టారు.

నిర్మల కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని దాచిపెట్టి, దేవుడిపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు హిందుత్వానికి అవమానం అని పేర్కొన్నారు. దేశ ఆర్థిక మందగమనానికి, కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి దైవఘటన కారణమని ఆర్థికమంత్రి చెప్పడం సబబు కాదని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. దేవుడిపై నింద మోపిన కేంద్రం, దీనిపై దేవుడ్ని ఏ కోర్టులో విచారిస్తుందని ప్రశ్నించారు. మీ చేతకానితనానికి దేవుడ్ని నిందిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sanjay Raut
Nirmala Sitharaman
Act Of God
Economy
India
Corona Virus

More Telugu News