Somu Veerraju: అంతర్వేది ఘటనపై సీఎం జగన్ వెంటనే స్పందించి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి: సోము వీర్రాజు

AP BJP President Somu Veerraju demands a probe team on Antarvedi chariot burning
  • లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతి
  • ఘటన స్థలిని పరిశీలించనున్న జిల్లా బీజేపీ బృందం
  • మూడ్రోజుల్లో దోషులను శిక్షించాలన్న సోము
అంతర్వేది పుణ్యక్షేత్రంలో రథం దగ్ధం ఘటనపై విపక్షాలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దీనిపై సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ జిల్లా బృందం అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటన స్థలిని పరిశీలిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని, సీఎం జగన్ వెంటనే స్పందించి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మూడ్రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన దోషులను శిక్షించే ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.
Somu Veerraju
Antarvedi
Chariot
Burning
Jagan
BJP
East Godavari District
Andhra Pradesh

More Telugu News