Lord Balaji: పునఃప్రారంభం తర్వాత ఇవాళ తిరుమల వెంకన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం

  • కరోనాతో కొన్నిరోజుల పాటు మూతపడిన శ్రీవారి ఆలయం
  • ఇటీవలే దర్శనాల పునరుద్ధరణ
  • నిన్న అత్యధిక సంఖ్యలో శ్రీవారి దర్శనం
Huge income for Tirumala Lord Balaji after reopening

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి క్షేత్రం మూతపడిన సంగతి తెలిసిందే. అయితే తిరుమలలో కొన్ని వారాల కిందట దర్శనాలు పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో, తిరుమల వెంకన్న సన్నిధి పునఃప్రారంభం తర్వాత నేడు రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. ఇవాళ హుండీ ద్వారా రూ.1 కోటి 2 లక్షలు ఆదాయం వచ్చినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, పునఃప్రారంభం తర్వాత అత్యధికంగా నిన్న స్వామివారిని 13,486 మంది దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెంకటేశ్వరుడి దర్శనాలను పరిమితం చేశారు.

More Telugu News