YV Subba Reddy: రుషికేశ్ వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి... శారదాపీఠాధిపతితో భేటీ

TTD Chairman YV Subbareddy met Swaroopananda in Rishikesh
  • రుషికేశ్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వరూపానంద
  • బ్రహ్మోత్సవాలపై చర్చించిన వైవీ
  • వైవీ వెంట టీటీడీ ఈవో, అదనపు ఈవో
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రం రుషికేశ్ వెళ్లారు. రుషికేశ్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలిశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించే విషయంపై స్వరూపానందతో చర్చించినట్టు వైవీ వెల్లడించారు. అంతేకాకుండా, అనేక ధార్మిక అంశాలపైనా శారదా పీఠాధిపతి సలహాలు తీసుకున్నట్టు వివరించారు. కాగా, స్వరూపానందను కలిసిన సమయంలో వైవీ వెంట టీటీడీ ఈవో, అదనపు ఈవో కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను వైవీ ఫేస్ బుక్ లో పంచుకున్నారు.



YV Subba Reddy
Swaroopananda
Rushikesh
TTD
Sarada Peetham

More Telugu News