Galla Jayadev: టీడీపీ సర్కారు ఎంత ప్రగతిశీలకంగా వ్యవహరించిందో చెప్పేందుకు ఇదే నిదర్శనం: గల్లా జయదేవ్

Galla Jaydev responds after AP got first rank in Ease Of Doing Business fourth time in row
  • ఈజ్ ఆఫ్ డూయింగ్... లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్
  • టీడీపీ ప్రభుత్వం చర్యలను ప్రస్తావించిన గల్లా జయదేవ్
  • ఆధిక్యతను చేజారనివ్వరాదంటూ వైసీపీ సర్కారుకు సూచన
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్-2019లోనూ ఏపీ ప్రథమస్థానంలో నిలవడం పట్ల టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. వరుసగా నాలుగోసారి ఏపీ దేశంలోని మిగతా రాష్ట్రాలను అధిగమించి ఈ ఘనత సాధించిందని తెలిపారు. నూతన సంస్కరణలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎంత ప్రగతిశీలకంగా వ్యవహరించిందో చెప్పడానికి ఇది స్పష్టమైన నిదర్శనం అని తెలిపారు.

రాష్ట్రం ఇవాళ ఈ గొప్పదనం సాధించిందంటే అందుకు కారణం టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలేనని స్పష్టం చేశారు. పెట్టుబడులకు గమ్యస్థానంలా రాష్ట్రాన్ని మలిచినందుకు లభించిన ప్రతిఫలం అని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు ఈ ఆధిక్యతను చేజారనీయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏదేమైనా, మనం అందరం కోరుకునేది రాష్ట్రం శక్తిమంతం కావాలని, ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవాలనేనని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు.
Galla Jayadev
Andhra Pradesh
First Rank
Ease Of Doing Business
Telugudesam
YSRCP

More Telugu News