Hansika: హన్సిక యూట్యూబ్ ఛానెల్ దూకుడు.. థ్యాంక్స్ చెప్పిన ముద్దుగుమ్మ

Hansikas You Tube channel gets one lakh subscribers
  • యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన హన్సిక 
  • పర్సనల్ విషయాలు, వీడియోలు పోస్టింగ్ 
  • తాజాగా లక్ష దాటిన సబ్ స్క్రైబర్స్ సంఖ్య 
లాక్ డౌన్ కారణంగా షూటింగులు బంద్ కావడంతో తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గత ఐదు నెలల నుంచీ చాలామంది తారలు అసలు ఇళ్లలోంచి బయటకే రావడం లేదు. దీంతో టైం పాస్ కోసం ఒక్కొక్కరు ఒక్కో పనిచేస్తున్నారు. కొందరు కిచెన్ లో దూరి వంటలు నేర్చుకుంటుంటే .. మరికొందరు ఆన్ లైన్ ద్వారా కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు. మరికొందరు పుస్తక పఠనంలో నిమగ్నమవుతున్నారు.

ఈ క్రమంలో అందాలతార హన్సిక కూడా ఒక యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇందులో తన పర్సనల్ విషయాలను, మేకప్ కు సంబంధించిన వీడియోలను, ఇంకా రకరకాల ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తోంది. దీంతో ఇది అభిమానులను బాగా ఆకట్టుకోవడంతో సబ్ స్క్రైబర్స్ బాగా పెరిగారు. తాజాగా ఈ ఛానెల్ సబ్ స్క్రైబర్స్ సంఖ్య లక్ష దాటింది.

ఈ సందర్భంగా హన్సిక తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'ఛానెల్ లక్ష మంది సబ్ స్క్రైబర్స్ కి చేరుకోవడం చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగమైనందుకు సంతోషంగా వుంది. మరిన్ని ఎగ్జయిటింగ్ వీడియోలను మీకు అందిస్తాను. మీరు చూపుతున్న ప్రేమకు, మద్దతుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అంటూ హన్సిక పోస్ట్ పెట్టింది.
Hansika
You Tube
Channel
Subscribers

More Telugu News