Harish Rao: దయచేసి నాకు ఫోన్ చేయొద్దు.. నన్ను కలవ‌ద్దు: హ‌రీశ్ రావు విన‌తి

harish requests to party workers
  • ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు
  • మీ ప్రేమే నాకు అసలైన వైద్యం
  • నా హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ట్విట్టర్లో ఇస్తాను
త‌న‌కు క‌రోనా సోకింద‌ని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని తెలంగాణ మంత్రి హరీశ్ రావు తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ వార్త తెలి‌య‌గానే చాలా మంది ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో హ‌రీశ్ రావు ట్విట్ట‌ర్ లో ఓ విజ్ఞ‌ప్తి చేశారు.

"నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రేమే నాకు అసలైన వైద్యం. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, నన్ను కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నా హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ట్విట్ట‌ర్ ద్వారా మీతో షేర్ చేసుకుంటాను" అని హ‌రీశ్ రావు ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.
Harish Rao
Telangana
Corona Virus

More Telugu News