Amaravati: అమరావతిలో మాయమైన అంబేద్కర్ విగ్రహాలు.. ఆందోళనకు దిగిన దళిత సంఘాలు!

Ambedkar statues stolen in Amaravati
  • అంబేద్కర్ స్మృతివనంలో మాయమైన విగ్రహాలు
  • ఒక విగ్రహం కళ్లద్దాలు ధ్వంసం
  • దళిత సంఘాలకు సంఘీభావం ప్రకటించిన అమరావతి రైతులు
అమరావతి ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహాలు మాయం కావడం కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో అక్కడ ఆరు నమూనా విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఐదు మాయం అయ్యాయి. మరో విగ్రహానికి ఉన్న కళ్లద్దాలను పగలగొట్టారు. దీంతో స్మృతివనం వద్ద దళిత ఐకాస నేతలు ఆందోళనకు దిగారు. విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై అమరావతి రైతులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఓ వైపు ఆందోళలను జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంపై మండిపడుతున్నారు. దళిత ఐకాసకు సంఘీభావం పలుకుతూ, వారితో పాటు ఆందోళనలో కూర్చున్నారు.
Amaravati
Ambedkar
Statue
Theft

More Telugu News