Sushant Singh Rajput: థ్యాంక్యూ భగవాన్.. రియా సోద‌రుడి అరెస్టుపై సుశాంత్ సోద‌రి

sushant sister tells thanks to god
  • నిన్న షోవిక్ ను అరెస్టు చేసిన ఎన్సీబీ
  • డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు
  • ఎన్సీబీపై సుశాంత్ సోద‌రి ప్ర‌శంస‌లు
బాలీవుడ్ యువ‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో ద‌ర్యాప్తు జ‌రుపుతోన్న అధికారులు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని గుర్తించిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు డ్ర‌గ్స్ డీల‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై నిన్న సుశాంత్ ప్రియురాలు రియా సోద‌రుడు షోవిక్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. రియాపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోన్న సుశాంత్ కుటుంబం ఈ విష‌యంపై హ‌ర్షం వ్య‌క్తం చేసింది.

సుశాంత్ సోద‌రి శ్వేత సింగ్‌ కీర్తి ట్విట్ట‌ర్ లో ఈ విష‌యంపై స్పందిస్తూ...
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స‌మ‌ర్థంగా విచార‌ణ జ‌రుపుతోంద‌ని చెప్పారు. తామంతా సత్యం వైపు పయనించేలా మార్గదర్శనం చేస్తున్నందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాన‌ని ఆమె ట్వీట్ చేశారు.

త‌న సోద‌రుడి కేసులో న్యాయం జరగాలని పోరాడుతున్న వారికి ఇదొక ఉపశమనమని పేర్కొన్నారు. గ్రేట్ స్టార్ ఎన్సీబీ అంటూ ఆమె హ్యాష్ ట్యాగ్ జోడించారు. కాగా, సుశాంత్ నుంచి రూ. 15 కోట్ల డ‌బ్బును రియా త‌న ఖాతాలో వేయించుకుంద‌ని సుశాంత్ కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. సుశాంత్‌కు రియానే డ్రగ్స్‌ అలవాటు చేసిందని కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.
Sushant Singh Rajput
Crime News
mumbai

More Telugu News