చైనా సైనికులు ఐదుగురు స్థానికులను అపహరించారు: అరుణాచల్ ఎమ్మెల్యే ఆరోపణ

05-09-2020 Sat 10:35
  • అరుణాచల్ ప్రదేశ్ లో అపహరణ
  • సుబానాసిరి జిల్లాలో అపహరించారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
  • గతంలో కూడా ఇలాంటివి జరిగాయని సంచలన వ్యాఖ్య
Chinese Army Abducted 5 Indians
ఓవైపు లడఖ్ తూర్పు ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న చైనా... మరోవైపు అమానుష ఘటనలకు కూడా దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైనికులు అపహరించారు. ఈ ఘటనపై స్థానికంగా కలకలం రేగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ మాట్లాడుతూ, సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురిని చైనా బలగాలు అపహరించాయని... గతంలో కూడా ఇలాంటివి జరిగాయని చెప్పారు. అంతేకాదు ఇదే విషయాన్ని ప్రధాని కార్యాలయానికి కూడా ట్యాగ్ చేశారు.