Kollywood: కోలీవుడ్ నటి గాయత్రి ఇంట్లో నర్సు చేతివాటం.. బంగారం చోరీ!

Theft in Actress Gayatri Sainath
  • తల్లికి సపర్యలు చేసేందుకు నర్సు నియామకం
  • 111 గ్రాముల బంగారం చోరీ చేసి తాకట్టు
  • నర్సును అదుపులోకి తీసుకున్న పోలీసులు
కోలీవుడ్ నటి గాయత్రి సాయినాథ్ ఇంట్లో పనిచేస్తూ చేతివాటానికి పాల్పడిన నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై రాయపేటలోని లాయిడ్స్ రోడ్డు వీధిలో నటి గాయత్రి తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. వృద్ధురాలైన తన తల్లికి సపర్యలు చేసేందుకు మైలాపూర్ కబాలితోటకు చెందిన శివకామి అనే నర్సును నియమించుకున్నారు.

కాగా, ఇటీవల నటి ఇంట్లో 111 గ్రాముల బంగారం చోరీకి గురైంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చోరీకి పాల్పడింది నటి ఇంట్లోని నర్సు శివకామియేనని పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగిలించిన బంగారాన్ని శివకామి తాకట్టు పెట్టినట్టు తేలింది. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నటి గాయత్రికి అందజేశారు.
Kollywood
Actress
Gayatri sainath
Theft
Crime News

More Telugu News