అదృష్టమంటే అతడిదే.. యూఏఈ లాటరీలో భారతీయుడికి రూ. 19.90 కోట్ల లాటరీ!

05-09-2020 Sat 07:53
  • షార్జాలో ఐటీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్
  • రెండేళ్లుగా టికెట్లు కొంటున్న వైనం
  • ఎట్టకేలకు వరించిన అదృష్టం
Punjab man wins Rs 20 crore in lottery in Dubai
యూఏఈలోని భారతీయుడిని అదృష్టం వరించింది. లాటరీలో కోట్లాది రూపాయలు గెలుచుకున్నాడు. పంజాబ్‌కు చెందిన గురుప్రీత్ సింగ్ (35) షార్జాలోని ఓ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా బిగ్ టికెట్ లాటరీ కొనుగోలు చేస్తున్న ఆయనని ఎట్టకేలకు అదృష్టం వరించింది.

 ఈ నెల 3న ప్రకటించిన లాటరీ ఫలితాల్లో గురుప్రీత్ జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 10 మిలియన్ దిర్హామ్స్ (దాదాపు రూ. 19.90 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ మేరకు ‘ఖలీజ్ టైమ్స్’ తెలిపింది. అంత పెద్ద మొత్తం తగలడంతో గురుప్రీత్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆ డబ్బుతో దుబాయ్‌లో మంచి ఇల్లు కొనుక్కుని పంజాబ్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులను తన వద్దకు తీసుకొచ్చుకుంటానని గురుప్రీత్ చెప్పుకొచ్చాడు.