Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, ఉప ఎన్నికలను ఏక కాలంలో నిర్వహిస్తాం: ఎన్నికల సంఘం

Bihar assembly and bypolls will conduct same time
  • నవంబరు 29లోగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 
  • ఏక కాలంలో ఉప ఎన్నికలు
  • త్వరలోనే షెడ్యూలు విడుదల
బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు వివిధ కారణాలతో ఖాళీ అయిన దేశంలోని 64 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. కేంద్ర బలగాల తరలింపు, ఇతర సమస్యలను అధిగమించడంలో భాగంగా నిన్న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నవంబరు 29లోగా నిర్వహించాల్సి ఉన్నందున, ఆయా ఉపఎన్నికలను కూడా వాటితో పాటే నిర్వహించాలని నిర్ణయించామని, త్వరలోనే ఎన్నికల షెడ్యూలును ప్రకటించనున్నట్టు తెలిపింది.
Bihar
Assembly elections
EC
Bypolls

More Telugu News