Pawan Kalyan: తల్లీ నువ్వు వేసిన డ్రాయింగ్ చాలా చక్కగా ఉందమ్మా... నిన్ను తప్పకుండా కలుస్తాను: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes his fan and promise her to meet in Vizag
  • పవన్ చిత్రం గీసిన దివ్యాంగురాలు స్వప్న
  • రెండు చేతులు లేని స్వప్న
  • పవన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన వైనం
విశాఖకు చెందిన స్వప్న అనే దివ్యాంగురాలు చేతులు లేకపోయినా నోటితోనే పెన్సిల్ తో పవన్ కల్యాణ్ చిత్రాన్ని డ్రాయింగ్ వేసింది. ఆ పెన్సిల్ ఆర్ట్ చిత్రపటం పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. బంగారు తల్లి స్వప్న అంటూ పవన్ ఎంతో ఆత్మీయంగా స్పందించారు. "నువ్వు వేసిన డ్రాయింగ్ చాలా చక్కగా ఉంది తల్లీ. ఈ డ్రాయింగ్ ను జనసైనికులు నా దృష్టికి తీసుకువచ్చారు. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా కలుస్తాను... జాగ్రత్త అమ్మ!" అంటూ వ్యాఖ్యానించారు. కాగా, దివ్యాంగురాలు స్వప్న పవన్ కు బర్త్ డే విషెస్ చెబుతున్న వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

Pawan Kalyan
Fan
Swapna
Pencil Art
Vizag

More Telugu News