Delivery Boy: భార్య తీరుతో మనస్తాపం చెంది కుమార్తె సహా ఆత్మహత్య చేసుకున్న డెలివరీ బాయ్

Delivery boy commits suicide along with his daughter
  • చిత్తూరులో విషాద ఘటన
  • భార్య అక్రమ సంబంధాలతో కుంగిపోయిన భర్త
  • కుమార్తెపై భార్య ప్రియుడి లైంగిక వేధింపులతో మరింత వేదన
చిత్తూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ డెలివరీ బాయ్ తన భార్య ప్రవర్తనతో మనస్తాపానికి గురై కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. గణేశ్ ఓ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అయితే భార్య అక్రమ సంబంధాలపై ఎన్నోసార్లు విభేదించాడు. పెద్ద మనుషుల జోక్యంతో కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగినా, భార్య మళ్లీ అక్రమ సంబంధాలకు మొగ్గుచూపడంతో గణేశ్ కుంగిపోయాడు. దాంతో ఇద్దరూ వేర్వేరుగా ఉండేవాళ్లు.

అయితే  ఐదేళ్ల కుమార్తె కార్తీకను భార్య తన వద్దే ఉంచుకుంది. కుమార్తె కోసం కోర్టును ఆశ్రయించినా గణేశ్ కు ఫలితంలేకపోయింది. దాంతో ఇక చావే శరణ్యం అని భావించి, కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి ముందు ఓ సెల్ఫీ వీడియోలో తన బాధను వివరించాడు. చిన్నారి కార్తీకను భార్య ప్రియుడు లైంగికంగా వేధిస్తుండేవాడని గణేశ్ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు.

తొలుత కుమార్తెకు ఉరివేసిన గణేశ్, ఆపై తాను కూడా ఉరివేసుకుని తనువు చాలించాడు. దీనిపై గణేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
Delivery Boy
Suicide
Daughter
Chittoor District
Wife

More Telugu News