Hole: సైబీరియా ప్రాంతంలో మరో భారీ గొయ్యి... శాస్త్రవేత్తలకు అంతుబట్టని వైనం!

  • 30 మీటర్ల లోతు, 20 మీటర్ల వెడల్పు ఉన్న గొయ్యి
  • గొయ్యిని గుర్తించిన రష్యా టీవీ చానల్ బృందం
  • గతంలో ఇలాంటి బిలాల గుర్తింపు
Another huge hole founded in Siberia

రష్యాలోని సైబీరియా టండ్రా ప్రాంతంలో ఓ భారీ గొయ్యి విస్మయానికి గురిచేస్తోంది. ఇది ఎలా ఏర్పడిందో  శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడంలేదు. ఓ రష్యన్ టీవీ చానల్ కు చెందిన బృందం ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తుండగా ఈ బిలం వారి కంటపడింది. ఇది 30 మీటర్ల లోతు, 20 మీటర్ల వెడల్పు ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో 2013 నుంచి ఇలాంటి భారీ బిలాలు కనిపిస్తున్నా, అవి ఏ కారణంగా ఏర్పడ్డాయన్న దానిపై స్పష్టత లేదు.

ఉత్తర సైబీరియాలోని యమల్ ద్వీపకల్పం వద్ద ఓ చమురు, సహజవాయు క్షేత్రం సమీపంలో ఇలాంటి బిలాన్ని మొట్టమొదటగా కనుగొన్నారు. భారీ ఉల్కాపాతం ప్రభావంతో ఇది  ఏర్పడిందని అప్పట్లో భావించినా, అందుకు శాస్త్రీయపరమైన ఆధారాలు లేవు. అలాగే గ్రహాంతర వాసుల నౌక దిగడంతో ఆ గొయ్యి ఏర్పడిందని, లేక సైన్యానికి చెందిన భూగర్భ నిర్మాణం ఏదైనా కుప్పకాలడంతో అది ఏర్పడి ఉండవచ్చని కూడా ప్రచారం జరిగింది.

ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. ఇది భారీ స్థాయిలో మీథేన్ వాయువు విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. కానీ ఈ వాదనపైనా ఏకాభిప్రాయం లేదు.

  • Loading...

More Telugu News