Tamannaah: అనుష్క చాలా సాయం చేసిందంటోన్న తమన్నా

Thamanna says Anushka helped her in her career beginning
  • నేటి కథానాయికల మధ్య స్నేహశీల వాతావరణం 
  • కాస్ట్యూమ్స్ ఎంపికలో తమన్నాకు అనుష్క సాయం 
  • కాజల్, సమంత మంచి స్నేహితులంటున్న తమ్మూ  
కథానాయికల మధ్య పోటీ ఉంటుందనీ, వారి మధ్య సయోధ్య ఉండదనీ, సెట్లో వాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉంటుంటారనీ చాలామంది అనుకుంటూ వుంటారు. కొన్ని దశాబ్దాల క్రితం నాడు అయితే కనుక, ఇందులో వాస్తవం ఉండేది కానీ, ఇప్పుడు మాత్రం అలా లేదు.

నేటి హీరోయిన్లు విశాల దృక్పథంతో స్నేహశీలంగా వుంటున్నారనే చెప్పాలి. ఒకరి సినిమా హిట్టయితే మరొకరు అభినందించుకోవడం.. ఎక్కడైనా ఎదురుపడితే హాయిగా కబుర్లు చెప్పుకోవడం.. ఖాళీ దొరికితే కలసి ఎంజాయ్ చేయడం.. వంటి సుహృద్భావ వాతావరణం వుంది.

ఇక తమన్నా అయితే, తనకు అనుష్క, కాజల్, సమంతా ఇక్కడ మంచి స్నేహితులని చెబుతోంది. అంతేకాదు, అనుష్క తనకు కెరీర్ మొదట్లో ఎంతగానో హెల్ప్ చేసిందని కూడా చెప్పింది. 'నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో నాకు కాస్ట్యూమ్ డిజైనర్ లేరు. అనుష్కే కాస్ట్యూమ్స్ ఎంచుకునే విషయంలో నాకు సాయపడేది. అంతేకాదు, ఇప్పటికీ నాకెలాంటి అవసరం వచ్చినా ఫోన్ చేస్తే చాలు, వెంటనే స్పందిస్తుంది. అలాగే కాజల్, సమంతా  కూడా నాకు మంచి ఫ్రెండ్స్' అంటూ చెప్పుకొచ్చింది.
Tamannaah
Anushka Shetty
Kajal Agarwal
Samantha

More Telugu News