Corona Virus: కరోనా వ్యాక్సిన్ పరిశోధనల్లో మరో ఆశాకిరణం.. ప్రొటీన్ల ఉత్పత్తికి దోహదపడే టీకాతో వైరస్‌కు చెక్!

  • ఒహైయో యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన
  • రెండు ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకునే వైరస్
  • ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో విజయవంతం
Another vaccine getting ready to fight with covid

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారితో పోరులో భాగంగా మరో సరికొత్త ఆవిష్కరణ రెడీ అయింది. వైరస్‌ను సమర్థంగా అడ్డుకునే కొన్ని ప్రొటీన్ల ఉత్పత్తికి దోహదపడే టీకాను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. అమెరికాలోని ఒహైయో వర్సిటీ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. వైరస్‌లు రెండు రకాల ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని జీవకణాలను ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తాయి. ఎలుకలపై జరిపిన పరిశోధనలో అధిక మోతాదులో ఈ ప్రొటీన్లు విడుదలయ్యేలా ‘సెల్యూలార్ ప్రాసెస్’ చేశారు. ఇలా చేయడం ద్వారా వాటిలోని జన్యు సమాచారాన్ని ఫంక్షనల్ ప్రొటీన్లుగా మార్చే ఆర్ఎన్ఏ మెసెంజర్ అణువుల సీక్వెన్స్ (అన్‌ట్రాన్స్‌లేటెడ్ రీజియన్స్-యూటీఆర్)లో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ టీకా ఇచ్చిన ఎలుకల్లో ఈ ప్రొటీన్లు అధిక మోతాదులో విడుదలవడమే కాకుండా, కొన్ని రోజుల్లోనే ఎలుకల్లో కొవిడ్ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం కొన్ని వ్యాక్సిన్లు చివరి దశ  క్లినికల్ పరీక్షల్లో ఉన్నాయి. ఇప్పుడు తాజా టీకా వాటికి ప్రత్యామ్నాయంగా మారగలదని పరిశోధనల్లో పాలు పంచుకున్న యు జో డాంగ్ పేర్కొన్నారు.

More Telugu News