Aishvarya Rai: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Manirathnams Ponnian Selvam shoot to be resumed soon
  • శ్రీలంకలో షూటింగ్ ప్లాన్ చేస్తున్న మణిరత్నం 
  • ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా అప్ డేట్
  • డిసెంబర్ నుంచి గోపీచంద్ బయోపిక్ షూటింగ్
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వం' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును ఈ నెలాఖరు నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉండడంతో షూటింగును శ్రీలంకలో నిర్వహించాలని భావిస్తున్నారట. అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్, విక్రం, కార్తి, జయం రవి, త్రిష తదితర బిజీ ఆర్టిస్టులు ఇందులో నటిస్తున్నారు. మోహన్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
*  ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహించుకుంటున్న ఈ చిత్రం పల్నాడు నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుందని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని సంస్థతో కలసి నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
*  బ్యాడ్మింటన్ చాంపియన్, ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితకథ తెరకెక్కనున్న సంగతి విదితమే. హీరో సుధీర్ బాబు టైటిల్ రోల్ పోషించే ఈ బయోపిక్ షూటింగ్ డిసెంబర్ నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. ఈ విషయాన్ని తాజాగా సుధీర్ బాబు వెల్లడించాడు.  
Aishvarya Rai
Manirathnam
Jr NTR
Trivikram Srinivas

More Telugu News