ధైర్యంగా ముందుకు వచ్చి.. షూటింగులో పాల్గొన్న నాగార్జున!
- షూటింగులకి భయపడుతున్న తారలు
- ఈ రోజు 'వైల్డ్ డాగ్' షూటింగు చేసిన వైనం
- సోల్మన్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్
- వీడియో విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ
ఈ తరుణంలో అక్కినేని నాగార్జున ధైర్యం చేశారు. ఏమాత్రం నదురూబెదురూ లేకుండా షూటింగుకి రెడీ అన్నారు. ఇప్పటికే 'బిగ్ బాస్ 4' రియాలిటీ షో షూటింగులో పాల్గొన్న ఆయన ఈ రోజు హైదరాబాదులో 'వైల్డ్ డాగ్' చిత్రం షూటింగులో కూడా జాయిన్ అయ్యారు. అహిశోర్ సోల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ షూటింగ్ కోసం చిత్రం యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. నాగార్జున చాలా హుషారుగా ఈ చిత్రం షూటింగులో పాల్గొన్నారని యూనిట్ చెబుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మేటినీ ఎంటర్ టైన్మెంట్ విడుదల చేసింది.