Jagga Reddy: మాయమాటలు చెప్పి రైతుల ఓట్లతో గెలిచారు: జగ్గారెడ్డి

KCR is expert in deceiving farmers says Jagga Reddy
  • ప్రజలతో మమేకమై ఉంటున్నా ఎన్నికల్లో ఓడిపోతున్నాం
  • ఎన్నికల ముందు కేసీఆర్ తీసుకొచ్చే రైతు పథకాలే దీనికి కారణం
  • ముక్కూమొహం తెలియని టీఆర్ఎస్ నేతలు కూడా గెలిచారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తాము 24 గంటలు ప్రజలతో మమేకమై ఉంటున్నా... ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పారు. దీనికి ఎన్నికలకు ముందు రైతుల కోసం కేసీఆర్ తీసుకొచ్చే పథకాలే కారణమని అన్నారు.

మాయమాటలు చెప్పి రైతుల ఓట్లు వేయించుకుని కేసీఆర్ గెలిచారని చెప్పారు. ఆ గాల్లో ముక్కూమొహం తెలియని టీఆర్ఎస్ నేతలు కూడా గెలిచారని అన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ప్రోత్సాహం లేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో ఐదో స్థానంలో తెలంగాణ ఉందని చెప్పారు. కరోనాను కట్టడి చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
Jagga Reddy
Congress
KCR
TRS

More Telugu News