India: 118 యాప్ లను ఇండియా నిషేధించడంపై చైనా ఆగ్రహం! 

  • సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న చైనా
  • పబ్జీ సహా 118 చైనా యాప్ లను నిషేధించిన భారత్
  • తప్పులను భారత్ సరిదిద్దుకోవాలన్న చైనా
China Says Strongly Opposes Indias Latest Ban On 118 Mobile Apps

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. డ్రాగన్ కంట్రీ ఆర్థిక వనరులను దెబ్బతీసేలా ఆ దేశ యాప్ లను నిషేధిస్తోంది. పబ్జీగేమ్ సహా ఆ దేశానికి చెందిన 118 యాప్ లను నిన్న భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్ తీసుకున్న ఈ చర్యపై చైనా మండిపడింది. భారత్ నిర్ణయాన్ని తప్పుపట్టింది.

భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు చైనా పెట్టుబడిదారులు, సర్వీస్ ప్రొవైడర్ల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ అన్నారు. తన తప్పులను భారత్ సరిదిద్దుకోవాలని చెప్పారు. భారత్ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మరోవైపు, సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి ఎంత దూరం వెళ్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది.

More Telugu News