Pawan Kalyan: మెహర్ రమేశ్ కి 'ఆల్ ది బెస్ట్' చెప్పిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan reveals the name of Chiranjeevis next director
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో నటించనున్న చిరు
  • రమేశ్ కు ధన్యవాదాలు తెలిపిన పవన్
  • చిరు తదుపరి చిత్రంపై క్లారిటీ
చిరంజీవి సినిమా గురించి ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి అంతాఇంతా కాదు. ఆయనకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా వైరల్ అవుతుంది. అలాంటిది ఆయన కొత్త సినిమాకు సంబంధించిన వార్త అయితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నారు.

 ఈ క్రమంలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో కూడా చిరు సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ... దానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే, దీన్ని నిన్న పవన్ కల్యాణ్ కన్ఫామ్ చేశారు.

నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కు మెహర్ రమేశ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ... రమేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు... చిరంజీవితో మీరు తీయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. దీంతో, చిరు, మెహర్ రమేశ్ కాంబినేషన్లో సినిమా రాబోతోందనే విషయం కన్ఫామ్ అయింది.
Pawan Kalyan
Chiranjeevi
Mehar Ramesh
Tollywood
Next Movie

More Telugu News