Fans: మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు రూ.12.5 లక్షల చొప్పున సాయం.. జనసేన ప్రకటన

Huge amount of donations towards deceased fans of Pawan Kalyan
  • చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రమాదం
  • ముగ్గురు పవన్ అభిమానుల మృతి
  • ఉదారంగా విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖులు
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకోవడం తెలిసిందే. రాజేంద్ర, అరుణాచలం, సోమశేఖర్ అనే ముగ్గురు పవన్ అభిమానులు ఫ్లెక్సీకి కరెంటు వైర్లు తగలడంతో మృతి చెందారు. దాంతో వారి కుటుంబాలపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి.

జనసేన పార్టీ మాత్రమే కాకుండా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, వకీల్ సాబ్ చిత్రబృందం, మెగా సూర్య ప్రొడక్షన్స్ కూడా ఆర్థికసాయం ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.12.5 లక్షల మేర ఆర్థిక సాయం అందనుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు విరాళం ప్రకటించిన అందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు.
Fans
Death
Pawan Kalyan
Donations
Kuppam
Chittoor District

More Telugu News