BCCI: బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యుడికి కరోనా పాజిటివ్

BCCI Medical staff tests positive with Corona
  • ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్న మెడికల్ ఆఫీసర్
  • ఐపీఎల్ పై కరోనా ప్రభావం
  • ఇప్పటికే 13 మంది సీఎస్కే ఆటగాళ్లకు కరోనా
ఐపీఎల్ కోసం బీసీసీఐ అధికారులతో పాటు ఫ్రాంచైజీలు యూఏఈకి వెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు యూఏఈకి వెళ్లిన వారిలో పలువురు కరోనా బారిన పడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని 13 మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

మరోవైపు యూఏఈలో ఉన్న బీసీసీఐ వైద్య బృందంలోని ఒక సభ్యుడు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనలో కరోనా లక్షణాలు లేవని... ప్రస్తుతం ఆయనను ఐసొలేషన్ లో ఉంచామని బీసీసీఐ అధికారులు చెప్పారు. అందరి ఆరోగ్యాన్ని చూసే మెడికల్ ఆఫీసరే కరోనా బారిన పడటం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నెల 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబిల్లో ఐపీఎల్ జరగనుంది.
BCCI
Medica Officer
Corona Virus

More Telugu News