డెస్క్ టాప్ వెర్షన్ లో పబ్జీ గేమ్ ఆడే అవకాశం!

  • పబ్జీ సహా 118 చైనా యాప్ లపై కేంద్రం నిషేధం
  •  దక్షిణకొరియా సంస్థ వద్ద పబ్జీ డెస్క్ టాప్ హక్కులు
  • ఇప్పటికే టిక్ టాక్ ను నిషేధించిన భారత్
PUBG Games may be available in desktop version in India

గత కొన్నినెలలుగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో చైనా యాప్ లపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే టిక్ టాక్, హలో వంటి యాప్ లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం నిన్న పబ్జీ గేమ్ సహా 118 చైనా యాప్ లపై నిషేధాజ్ఞలు విధించింది.

అయితే, కేంద్ర ప్రభుత్వం పబ్జీ యాప్ ను నిషేధించినా ఈ గేమ్ ను డెస్క్ టాప్ వెర్షన్లో ఆడే వీలుంది. ఎందుకంటే పబ్జీ మాతృసంస్థ దక్షిణకొరియాకు చెందిన సంస్థ. ఈ సంస్థ మొబైల్ యాప్ హక్కులను చైనాకు చెందిన టెన్ సెన్ట్ సంస్థకు విక్రయించింది. డెస్క్ టాప్ వెర్షన్ హక్కులు మాత్రం దక్షిణకొరియా సంస్థ వద్దే ఉన్నాయి. పబ్జీ డెస్క్ టాప్ వెర్షన్ దక్షిణ కొరియా సంస్థకు చెందినది కాబట్టి భారత్ లో దీనిపై నిషేధం విధించకపోవచ్చని తెలుస్తోంది.

More Telugu News