Satyadev: పవన్ కల్యాణ్ ట్వీట్ తో ఆనందంలో మునిగిపోయిన సత్యదేవ్!

Satyadev felt cherished with Pawan Kalyans tweet
  • పవన్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన సత్యదేవ్
  • ఆ చిత్రంలో మీ నటన అద్భుతమన్న పవన్
  • మర్చిపోలేని బహుమతి ఇచ్చారన్న సత్యదేవ్
టాలీవుడ్ లో తనను తాను నిరూపించుకున్న నటుల్లో సత్యదేవ్ ఒకరు. వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సత్యదేవ్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యదేవ్ ట్వీట్ పై పవన్ స్పందించారు. 'థాంక్యూ సత్యదేవ్ గారు. మీ తాజా చిత్రం 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య'లో మీ పర్ఫామెన్స్ ను చాలా ఎంజాయ్ చేశా. ఆల్ ది బెస్ట్' అని ట్వీట్ చేశారు.

పవన్ స్పందనపై సత్యదేవ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 'ధన్యవాదాలు సార్. మీ బర్త్ డే సందర్భంగా మీరు ఇచ్చిన బహుమతిని మర్చిపోలేను. మీ ట్వీట్ తో మా 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' టీమ్ మొత్తం సంతోషపడుతోంది' అని సత్యదేవ్ ట్వీట్ చేశారు.
Satyadev
Pawan Kalyan
Tollywood

More Telugu News