జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

03-09-2020 Thu 11:18
  • సచివాలయంలో సమావేశం
  • ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై చర్చ
  • స్టేట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఆమోద ముద్రపడే ఛాన్స్
ap cabinet meets
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర‌ కేబినెట్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో జగన్‌ చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం, వైఎస్సార్‌ ఆసరా, సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక పథకాలతో పాటు గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్‌, గాలేరు, నగరి నుంచి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం వంటి వాటిపై చర్చిస్తున్నారు.

అలాగే, గిరిజన ప్రాంతాల్లో బ్రాడ్‌ బ్యాండ్ సేవల అమలు, యురేనియం ప్రభావిత గ్రామాల్లో ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు. కురుపాం గిరిజన ఇంజినీరింగ్‌ కాలేజీలకు పోస్టుల మంజూరుపై ఈ మంత్రివర్గ సమావేశంలో‌ ఆమోదం తెలపనున్నారు. అలాగే, ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఆమోద ముద్ర పడనుంది. ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలను ఆకర్షించేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది.