Corona Virus: దేశంలో ఒక్కరోజులో 83,883 కరోనా కేసులు

Singleday spike of 83883 new positive cases
  • మొత్తం కేసులు 38,53,407
  • మృతుల సంఖ్య మొత్తం 67,376
  • కోలుకున్న వారు 29,70,493  మంది 
  • ప్రస్తుతం 8,15,538 మందికి చికిత్స 
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 83,883 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 1,043 మంది మృతి చెందారు.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 38,53,407కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 67,376 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 29,70,493 మంది కోలుకున్నారు. 8,15,538 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో రికవరీల రేటు 77 శాతంగా ఉంది.

కాగా, మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 8,25,739 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 17,433 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 292 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 25,195గా ఉంది. మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో అత్యధిక కరోనా కేసులు ఉన్నాయి.   
                             
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,55,09,380 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,72,179 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID-19
India

More Telugu News