Dilip Kumar: కరోనాతో బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ సోదరుడు మృతి

Dilip Kumars brother Ehsan Khan dies of Covid related complications
  • దిలీప్ కుమార్ ఇంట్లో వరుస విషాదాలు
  • గత నెల 21న ఆయన సోదరుడు అస్లామ్ ఖాన్ కన్నుమూత
  • ఇద్దరూ కరోనా సంబంధిత సమస్యలతోనే మృతి
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు ఇషాన్‌ఖాన్ కరోనా సంబంధిత సమస్యలతో నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు.  ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కరోనా వైరస్ సంబంధిత సమస్యలతో కన్నుమూసినట్టు లీలావతి ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు. ఆయనకు కరోనా సోకిందని, అలాగే, గుండె సంబంధిత సమస్యలతోపాటు హైపర్ టెన్షన్, అల్జీమర్స్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు.

కాగా, ఆగస్టు 21న దిలీప్ కుమార్ మరో సోదరుడు అస్లామ్ ఖాన్ కూడా లీలావతి ఆసుపత్రిలోనే కరోనాతో కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న దిలీప్ సోదరుల్లో ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
Dilip Kumar
Ehsan Khan
COVID-19
Bollywood

More Telugu News