Congress: దుబ్బాక ఉప ఎన్నిక బరిలో ‘రాములమ్మ’.. పార్టీ వర్గాల్లో టాక్!

Congress leader Vijayashanti ready to fight in Dubbaka
  • 2014 ఎన్నికల్లో మెదక్ నుంచి ఓటమి పాలైన విజయశాంతి
  • ఉమ్మడి మెదక్ జిల్లాపై విజయశాంతికి గట్టిపట్టు
  • గత ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ కి రెండో స్థానం
ఇటీవల కన్నుమూసిన సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గమైన దుబ్బాక ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సీనియర్ నేత విజయశాంతి రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.

‘రాములమ్మ’ను బరిలోకి దింపడం ద్వారా ఆ స్థానాన్ని కొల్లగొట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో మెదక్ ఎంపీగా ఉమ్మడి మెదక్ జిల్లాపై ఆమెకు మంచి పట్టుంది. దాదాపు అన్ని గ్రామాల్లోనూ పార్టీలకతీతంగా ఆమెకు పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను బరిలోకి దింపడం ద్వారా లబ్ధిపొందాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

2014 ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన విజయశాంతి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో దుబ్బాకకు సరైన అభ్యర్థి లేకున్నా రెండోస్థానాన్ని దక్కించుకోగలిగింది. దీంతో ఇప్పుడు విజయశాంతిని పోటీలో నిలపడం ద్వారా ఆ సీటును కైవసం చేసుకోవాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
Congress
Telangana
Vijayashanti
Medak District
Dubbaka

More Telugu News