Chandrababu: విజయవాడలో చంద్రబాబు.. అచ్చెన్నాయుడికి పరామర్శ

Chandrababu visits Atchannaidu house in Vijayawada
  • ఇటీవలే బెయిల్ పై విడుదలైన అచ్చెన్నాయుడు
  • తిరుమలలో కుటుంబసమేతంగా మొక్కు చెల్లింపు
  • అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న చంద్రబాబు
ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఈ ఉదయం కుటుంబ సమేతంగా మొక్కు తీర్చుకుని విజయవాడ చేరుకున్నారు.

మరోపక్క,  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారు. ఆయన పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించేందుకు వచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు వేర్వేరు కేసుల్లో బెయిల్ పొంది విడుదలై  సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదట అచ్చెన్నాయుడిని పరామర్శించారు. విజయవాడ కరెన్సీ నగర్ లో ఉన్న అచ్చెన్న నివాసానికి వెళ్లిన చంద్రబాబు... అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వెంట ఎంపీ కేశినేని నాని, ఇతర నేతలు ఉన్నారు. కాగా, చంద్రబాబు మరికాసేపట్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నివాసానికి వెళతారని సమాచారం.
Chandrababu
Atchannaidu
Vijayawada
ESI Scam
Telugudesam

More Telugu News