Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు.. డ్రగ్స్ డీలర్ ను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ బ్యూరో!

Narcotics Bureau Detains Drug Dealer In Mumbai In Sushant Rajput Death Case
  • డ్రగ్స్ డీలర్ తో రియా వాట్సాప్ చాటింగ్
  • రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
  • డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తిని ప్రశ్నిస్తున్న అధికారులు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం ఉందనే అనుమానాలు బలపడిన నేపథ్యంలో... నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉండవచ్చనే  కోణంలో నార్కోటిక్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసినట్టు నార్కోటిక్స్  అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఎవరిపై కేసు నమోదు చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు.

మరోవైపు, సదరు అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం... డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ డీలర్ తో హీరోయిన్ రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ఈ కేసులో కీలక ఆధారంగా ఉంది. డ్రగ్స్ మాఫియాకు బెంగళూరు, గోవా, ఢిల్లీతో సంబంధాలు ఉన్నట్టు సమాచారం.
Sushant Singh Rajput
Rhea Chakraborty
Bollywood
Drugs

More Telugu News