Pawan Kalyan: మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున అందించాలని పవన్ నిర్ణయం

Pawan Kalyan decides to give two lakhs rupees to the families deceased fans
  • చిత్తూరు జిల్లా శాంతిపురంలో విషాదం
  • పవన్ పుట్టినరోజు ఫ్లెక్సీలు కడుతూ ఫ్యాన్స్ దుర్మరణం
  • ఆర్థికసాయం అందించాలంటూ సిబ్బందిని ఆదేశించిన పవన్
తమ ఆరాధ్య హీరో, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతంతో మృతి చెందడం తెలిసిందే. చిత్తూరు జిల్లా శాంతిపురం ఏడో మైలు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ విషాదం పవన్ ను కదిలించివేసింది.

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలంటూ పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు, ప్రమాదం వివరాలు తెలుసుకున్న ఆయన క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు. దూరమైన బిడ్డలను తీసుకురాలేను కానీ, బిడ్డలు కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు నేను బిడ్డనై నిలుస్తానంటూ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Fans
Death
Ex Gratia
Tragedy
Santhipuram
Chittoor District
Janasena

More Telugu News