Bigg Boss Telugu 4: తనపై వస్తోన్న వార్తను ఖండించిన సింగర్ సునీత!

Dear friends I am not in the Biggboss 4 Telugu
  • బిగ్‌బాస్ 4 లో పార్టిసిపెంట్ గా సునీత పేరు ప్రచారం 
  • అందులో తాను లేనని వివరణ
  • భవిష్యత్తులోనూ ఉండనన్న గాయని 
సినీనటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్-4 త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 4 కోసం కొందరిని ఎంపిక చేశారంటూ కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. వాటిల్లో సింగర్ సునీత పేరు కూడా ఉంది. బిగ్‌బాస్‌ టీమ్ అధికారికంగా ప్రకటించకముందే కొన్ని వెబ్‌సైట్లు అత్యుత్సాహంతో సునీత పేరును ప్రస్తావించాయి.

దీనిపై స్పందించిన సునీత తాను అందులో పాల్గొనట్లేదని తెలిపారు. 'నా ప్రియమైన మిత్రులారా.. నేను బిగ్‌బాస్ 4 తెలుగులో లేను.. భవిష్యత్తులోనూ ఉండను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్' అని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించారు. కాగా, బిగ్‌బాస్‌4 షో ప్రోమో వీడియోలను ఇప్పటికే విడుదల చేసి, ఈ షోపై మేకర్స్‌ ఆసక్తి రేకెత్తిస్తోన్న విషయం తెలిసిందే.
Bigg Boss Telugu 4
Nagarjuna
Tollywood

More Telugu News