Baba Sehgal: చెప్పినట్టుగానే పవన్ కల్యాణ్ కోసం గిఫ్ట్ తెచ్చిన బాబా సెహగల్

Baba Sehgal releases a special club remix song for Pawan Kalyan birthday
  • నేడు పవన్ కల్యాణ్ జన్మదినం
  • క్లబ్ రీమిక్స్ సాంగ్ చేసిన బాబా సెహగల్
  • పుట్టినరోజున పవన్ కు, ఫ్యాన్స్ కు అంకితం
జాతీయస్థాయి ర్యాప్ సింగర్ బాబా సెహగల్ కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని తెలిసిందే. జల్సా చిత్రంలో టైటిల్ సాంగ్ పాడినప్పటి నుంచి బాబా సెహగల్ కు పవన్ అంటే అభిమానం. ఆ తర్వాత గబ్బర్ సింగ్ లోనూ మరోసారి టైటిల్ సాంగ్ ఆలపించిన ఈ ఇండీ ర్యాపర్ తాజాగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను పవన్ కు, ఫ్యాన్స్ కు అంకితం ఇచ్చారు. పవన్ కల్యాణ్ అంటూ సాగే ఈ గీతం ఆద్యంతం ఎంతో హుషారుగా సాగిపోతుంది. మొత్తమ్మీద బాబా సెహగల్ గాత్రంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేలా ఉందీ పాట.
Baba Sehgal
Club Remix Song
Pawan Kalyan
Birthday
Fans
Tollywood

More Telugu News