తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం... వరంగల్ సమీపంలో ఐదుగురి దుర్మరణం!

02-09-2020 Wed 07:56
  • ముందెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన కారు
  • ఇసుక లారీ ఢీకొనడంతో ప్రమాదం
  • కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు
5 Died Near Warangal Road Accident
వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. పసరగొండ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న ఇసుక లారీ, ఓ కారు ఢీ కొన్నాయని పోలీసులు వెల్లడించారు.

మరణించిన వారు జిల్లా పరిధిలోని పోచం మైదాన్ కు చెందిన వారని, వారిని మేకల రాకేశ్, చందు, రోహిత్, పవన్, సాబిర్ లుగా గుర్తించామన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి, ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ శ్రీనివాస్, సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.