IPL: ఈ చిల్లర లెక్కలెందుకు?.. ఐపీఎల్ ఫ్రాంచైజీలపై బీసీసీఐ అసహనం!

  • ఈ సీజన్ లో దుబాయ్ లో పోటీలు
  • నష్ట పరిహారం కోరుతున్న ఫ్రాంచైజీలు
  • పోటీలు సజావుగా సాగితే అదే పదివేలంటున్న బీసీసీఐ
BCCI Angry Over IPL Franchisies

ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరగకపోవడం, దుబాయ్ లో ప్రేక్షకులు లేకుండా పోయిన కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని ఫ్రాంచైజీలు చేస్తున్న డిమాండ్ పై బీసీసీఐ పెద్దలు అసహనాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పటికే కరోనా కారణంగా క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోయిందని, ఈ సమయంలో కూడా ఎలాగైనా పోటీలు జరిపించాలని, ఫ్రాంచైజీలకు కొంతమేరకైనా ఆదాయాన్ని భర్తీ చేయాలని తాము భావిస్తుంటే, ఈ చిల్లర లెక్కలేంటని మండిపడింది. పోటీలు సజావుగా సాగి, ఆటగాళ్లందరూ సురక్షితంగా తిరిగి ఇండియా చేరుకోవాలని ఆశించాలని, ఈ సీజన్ విజయవంతం కావాలని ఫ్రాంచైజీ యాజమాన్యాలు కోరుకోవాలని సూచించింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోటీలు జరుగుతాయని, బయో బబుల్ ను దాటి బయటకు వచ్చే ఆటగాళ్లపై, సిబ్బందిపై చర్యలుంటాయని హెచ్చరించింది.

More Telugu News