Ayatollah Ali Khamenei: ముస్లిం సమాజాన్ని యూఏఈ దారుణంగా మోసం చేసింది: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ

UAE Betrayed Muslim World With Israel Deal Says Irans Supreme Leader
  • ఇజ్రాయెల్ తో డీల్ కుదుర్చుకోవడం దారుణం
  • యూదుల కోసం యూఏఈ ద్వారాలు తెరిచింది
  • పాలస్తీనా గురించి పట్టించుకోవడం లేదు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బద్ధ శత్రువు ఇజ్రాయెల్ తో డీల్ కుదుర్చుకోవడం ద్వారా ఇస్లాంను, అరబ్ దేశాలను, ముస్లిం సమాజాన్ని, పాలస్తీనాను యూఏఈ దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు.

యూఏఈతో పాటు సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖొమైనీ విమర్శలు గుప్పించారు. యూదుల కోసం యూఏఈ పాలకులు ద్వారాలను తెరిచారని మండిపడ్డారు. పాలస్తీనా గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ విషయంలో యూఏఈ త్వరలోనే పశ్చాత్తాపానికి గురవుతుందని చెప్పారు.
Ayatollah Ali Khamenei
Iran
UAE
Israel

More Telugu News