Stephen Ravindra: కరోనా బారినపడిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర

Hyderbad west zone IG Stephen Ravindra tested corona positive
  • హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్
  • సోమవారం నాడు కరోనా పరీక్షలు చేయించుకున్న ఐజీ
  • రవీంద్రను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలన్న అధికారులు
హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా బారినపడ్డారు. సోమవారం ఆయన కరోనా టెస్టు చేయించుకోగా, పాజిటివ్ అంటూ ఇవాళ నివేదిక వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆయనను గతం వారం రోజుల్లో కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వ్యవహరించారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా స్టీఫెన్ రవీంద్రను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర బదిలీకి తెలంగాణ ప్రభుత్వం సమ్మతి తెలిపినా, కేంద్రం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. 
Stephen Ravindra
Corona Virus
Positive
IG
West Zone
Hyderabad

More Telugu News